జనగామ అర్బన్ (బచ్చన్నపేట), వెలుగు: ఈ-వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. సోమవారం జనగామ మండలం శామీర్పేట పరిధిలోని డీఆర్సీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్‌లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు.
అనంతరం బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించి, నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానాలను పరిశీలించారు. అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పర్యవేక్షించి, ఉగాదికి గృహప్రవేశం చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పంపిణీని అబ్జర్వ్ చేశారు. కార్యక్రమాల్లో డీపీవో వసంత, ఇతర ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
